హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణకు అవసరమైన భూములను కేటాయిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 28న రైల్వేస్టేషన్ ప్రారంభం నేపథ్యంలో సోమవారం తన నివాసంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, ప్రభాకర్, తాడూరి శ్రీనివాస్, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
స్టేషన్ విస్తరణకు అవసరమైన టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ భూములను కేటాయిస్తామని తెలిపారు. రాం పల్లి వైపు రోడ్డు నిర్మాణం, లైట్ల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని ఆదేశించారు.