హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే ఔటర్ రింగురోడ్డు లోపలి మున్సిపాలిటీలు, గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనగణన చేపడుతున్న నేపథ్యం లో వెంటనే ప్రాంతాల డీమార్కేషన్ చేయాలని కేంద్రం ఆదేశించినట్టుగా పేర్కొన్నారు. తెలంగా ణ మున్సిపాలిటీల సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లులపై శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీలో విలీనమైన 27మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు లేనందున ప్రజాభిప్రాయం తీసుకున్నట్టు తెలిపారు. విలీన ప్రాంతాల్లో పన్నులు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందరి అభిప్రాయాలు సేకరించాక ప్రకటిస్తామని తెలిపారు.