హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఎంతో మంది నిపుణులున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీజీ ఐఆర్డీ) సంస్థ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్న కార్యక్రమాల ను రూపొందించాలని మంత్రి సీతక సూచించారు. సంస్థ ద్వారా అందించే శిక్షణలు గ్రామీణ పాలనలో నాణ్యతను పెంచేలా ఉండాలని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ కార్యాలయం లో సంస్థ కార్యక్రమాలు, కార్యకలాపాలపై బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు స్థా నిక సంస్థల విధులు, నిధులు, హకులపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు మెటీరియల్ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీఈవో నిఖిల, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉం డాలని అధికారుల ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వడదెబ్బతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స అందించేందుకు ఒక బృందాన్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ ఏరియాలో సిద్ధంగా ఉంచాలని సూచించారు.