హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకాసురుల రాజ్యం’ అనే వీడియో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నదని ఆమె ఆక్షేపించారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన సీతక్క.. బేషరతుగా లిఖితపూర్వకంగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో కోరారు.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సంఘం ప్రధానాధికారి(సీఈవో)గా సీ సుదర్శన్‌రెడ్డి నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. 2002 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం జీఏడీ కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు సీఈవోగా ఉన్న వికాస్‌రాజ్ రాష్ట్ర సర్వీసులకు రానున్నారు.
హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ) : రైతుభరోసా పెట్టుబడి సాయం 5 ఎకరాలకే పరిమితం చేయాలనే అంశంపై మంత్రుల సబ్ కమిటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. చిన్న, సన్నకారు రైతులకే పెట్టుబడి సాయం అందేలా విధానాలు ఉండాలని కమిటీ నిర్ణయించినట్టు సమాచా రం. రైతుభరోసా విధివిధానాలపై మంత్రుల సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలిసారిగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో 92 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నట్టు అధికారులు కమిటీకి నివేదించారు. దీంతోపాటు ఇటీవల రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను కమిటీ ముందుంచారు.