హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం నిర్వహించిన ఎస్‌హెచ్‌జీ మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు.
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. అతివలు ఇంటికే పరిమితం కావద్దని, అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు ఇచ్చారు. మహిళా సంఘాలకు ఏటా రూ. 20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. పేదరికం మూలంగానే రాష్ట్రంలో నక్సలైట్లు పుట్టుకువచ్చారని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.