ఉద్యోగాల తొలగింపు అబద్ధం
స్త్రీనిధిలో ఒకరినీ కూడా తీసివేయలేదని, ఉద్యోగాల తొలగింపు అనేది అబద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని, సంస్థను బదనాం చేసేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని, సంస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు.
- హకులతోపాటు బాధ్యతలు మరువద్దు : సీతక్క
హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ) : స్త్రీనిధిలో ఒకరినీ కూడా తీసివేయలేదని, ఉద్యోగాల తొలగింపు అనేది అబద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని, సంస్థను బదనాం చేసేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని, సంస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే సంస్థలో ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని, సెర్ప్‌లో కూడా బదిలీలు పారదర్శకంగా జరిగాయని చెప్పారు. ప్రజాభవన్‌లో శనివారం స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
కొత్తగా ఏర్పాటైన స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను మంత్రి అభినందిస్తూనే, సంఘాలు హకుల కోసమే కాకుండా, బాధ్యతలను కూడా గుర్తుచేసేలా ఉండాలని చెప్పారు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32లక్షల మందికిపైగా మహిళలకు రూ.24వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని.. ఇది అసలు సిసలు మాహిళా బ్యాంక్ అని సీతక్క కొనియాడారు. తెలంగాణ స్త్రీనిధి మాడల్‌ను ఇతర రాష్ర్టాలు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న ఎండీ విద్యాసాగర్‌రెడ్డిని మంత్రి సీతక, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. డిప్యూటీ ఎండీ శ్రీనాథ్ నూతన నాయకత్వంలో సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిశోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

