హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన మ్యూజియంలో గిరిజన కెఫెటేరియాతోపాటు, 11 గిరిజనులకు చెందిన ఆలయాలను ఆవిష్కరించారు. అనంతరం మ్యూజియంలో ఏర్పాటు చేసిన గొండు మహిళలు, గిరిజనులు తయారు చేసిన ఇప్ప లడ్డూలు, ఇప్ప బూరెలు, ఇప్పచాట్ మసాలా, జొన్నరొట్టెలు, బోటికూర, స్వీట్లు తదితర పదార్థాలను ఆమె రుచిచూశారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ శరత్, సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ వీ సముజ్వల, మ్యూజియం క్యూరేటర్ డీ సత్యనారాయణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.