హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): చేయూత పింఛన్ల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. అనర్హులకు పింఛన్లు అందకుండా చూడాలని కోరా రు.
గురువారం ప్రజాభవన్లో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, డైరెక్టర్ గోపితో కలిసి చేయూత పింఛన్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. నిజమైన లబ్ధిదారులకే పింఛన్లు అందేలా చూడాలని ఆదేశించారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు ఆలస్యమైతే లబ్ధిదారులకు సమాచారం అందించాలని సూచించారు.