హైదరాబాద్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ) : మహిళా సంఘాలు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని మంత్రి ధనసరి అనసూయ సీతక కొనియాడారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశంలో సీతక మా ట్లాడారు. ప్రస్తుతం స్త్రీనిధి బ్యాంకు లో రూ.800 కోట్ల సేవింగ్స్ ఉన్నాయని, రూ.5,200 కోట్ల మూల నిధి ఉన్నదని తెలిపారు. మహిళలు బ్యాం కును ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని కొనియాడారు. త్వరలోనే గోదాములు, మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం ఇక్రిసాట్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పారు.
స్థానిక వనరుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ఆపద వస్తే మహిళా సంఘాలు మేమున్నామం టూ ఆదుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మారెటింగ్ సౌకర్యం పెంచేందుకు శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బ జారు ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశా రు. స్త్రీ నిధి బ్యాంక్‌పై సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు రూపొందించిన పాటను మంత్రి ఆవిష్కరించారు. మెరుగైన ఫలితాలను సాధించిన మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. జిల్లాలో ఇందిరా మ హిళా శక్తి భవనాల నిర్మాణం కోసం తన వంతు బాధ్యతగా స్త్రీ నిధి బోర్డు రూ.22 కోట్లను అందజేసింది.