హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి రావల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రులను మంత్రి సీతక్క కోరారు. గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిసి మేడారం మాస్టర్‌ప్లాన్ పనులకు రూ.25 కోట్లు, మల్లూరు ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లు, మిషన్ వాత్సల్య రూ.105 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రి అథవాలెను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్ నిధుల విడుదలపై చర్చించారు. భేటీలో వికలాంగులకార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.