రేగొండ, నవంబర్ 24 : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి, రేగొండ మండల కేంద్రాల్లో వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరవుతారని మహిళలను స మావేశానికి తరలించాలని అధికార పార్టీ నాయకులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో వెలుగు సమాఖ్యలో పనిచేస్తున్న అధికారులు, ఫోన్ చేసి మంత్రి సీతక్క సమావేశానికి హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళలు పనులు వదులుకొని సమావేశానికి హాజరయ్యారు.