హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ): ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి గొడవ, రాద్ధాంతం జరగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. ‘అమ్మతోడు’ అంటూ ఒట్టేసి మరీ ఈ విషయాన్ని చెప్ప డం గమనార్హం. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాట్లాడారు. ‘నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా. నన్ను కన్న సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెప్తున్నా. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి గొడవలు, రాద్ధాంతం జరగలేదు. ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగింది.