హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మహిళలు రాజకీయాల్లో ఎదగడమే కష్టం.. అలాంటిది ఈ స్థాయికి వస్తే తమను కొందరు ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా పోస్టులు కొన్నిసార్లు తన మనోబలాన్ని దెబ్బతీశాయని వాపోయారు. అసెంబ్లీ లాబీలో శనివారం ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
‘సోషల్ మీడియా ద్వారా నాకు చాలా ఇబ్బంది ఏర్పడింది. కొందరు నా ఫొటోలు మార్ఫింగ్ చేసి.. మానసిక వేదనకు గురిచేశారు. సోషల్ మీడియాను సోషల్సర్వీస్కు వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తున్నది’ అని సీతక్క పేర్కొన్నారు.