సుల్తాన్‌బజార్, జనవరి 7: అవకాశమిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం కోఠిలోని మహిళా వర్సిటీ దర్బార్ హాల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ వో), వైఎఫ్‌ఎల్‌వో సంయుక్తంగా వివిధ వ్యాపార రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న 24 మంది మహిళలకు బిజినెస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎఫ్ఎల్వో మాజీ జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి, ఎఫ్ఎల్వో చైర్మన్ రీతూషా, వైఎఫ్‌ఎల్‌వో ఆర్తీషా హాజరయ్యా రు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం విజ్జుల్లత, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, తెలంగాణ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అభిలాష బిష్త్ తదితరులు అవార్డులు అందుకున్నారు.