లింగ్యానాయక్ మృతి పట్ల సీఎం సంతాపం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 కురవి: గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ (85) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లింగ్యానాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు టీ హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, సీ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావు తదితరులు లింగ్యానాయక్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కాగా ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు లింగ్యానాయక్ భౌతికకాయం వద్ద నివాళులర్పించి మంత్రి సత్యవతిరాథోడ్‌ను ఓదార్చారు.