Minister Satyavati Rathod | కేసీఆర్ పాలన స్వర్ణయుగం : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathod | రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన(CM KCR Rule) తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు.
సంగెం (వరంగల్) : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన(CM KCR Rule) తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని చింతలపల్లి, పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మిడివరం గ్రామాల్లో రూ. 12కోట్లతో చేపట్టి న సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు, ముమ్మిడివరం-చింతలపల్లి బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ముమ్మిడివరం గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ. 2వేల కోట్లతో గిరిజన తండాల్లో రోడ్లు వేయబోతున్నామని చెప్పారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి(Kalyanalaxmi), రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్(Chief Minister KCR) మరోసారి సీఎం కావాలని ఆశీర్వదించాలన్నారు. ఈనెలాఖరులో 4 లక్షల ఎకరాల పోడు భూములను పంచబోతున్నట్టు వెల్లడించారు.
పరకాల నియోజకవర్గంలో రూ. 2కోట్లతో బంజార భవన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లోకి వచ్చి అబద్ధాలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీయాలన్నారు. అనంతరం మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు ఇజ్జగిరి స్వప్న, గూడ కుమారస్వామి, ఇండ్ల రవికుమార్, కక్కెర్ల కుమారస్వామి, బిచ్చానాయక్, రమాదేవి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

