శనివారం 04 జూలై 2020
Telangana - May 25, 2020 , 13:42:59

అర్జున్ చవాన్ తల్లి మృతికి మంత్రి సత్యవతి సంతాపం

అర్జున్ చవాన్ తల్లి మృతికి మంత్రి సత్యవతి సంతాపం

మహబూబాబాద్ :  కంపెళ్లి బిల్యా నాయక్ తండాలో కెలోత్ అర్జున్ చవాన్ తల్లి మరణించడంతో ఆమె మృతికి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపి..నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం సంకీస గ్రామానికి చెందిన బాణోత్ శ్రీను, డీఆర్ డీఏలో సైంటిస్ట్ గా పని చేస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో మంత్రి సత్యవతి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. శ్రీను ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు.

ఈ సందర్భంగా తండావాసులు రైతులకు రైతుబంధు ఇవ్వడంలో, చెరువుకు నీరు రావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
logo