బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ గులాములు కాదు
ఉమ్మడి పాలనలో తెలంగాణ తీవ్ర అణచివేతకు గురైందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.
- పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ 420: మంత్రి సత్యవతి
ములుగు, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి పాలనలో తెలంగాణ తీవ్ర అణచివేతకు గురైందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతల మాదిరిగా ఢిల్లీకి గులాములు కాదని అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్ వేయగా ఈ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ములుగులో నిర్వహించిన రోడ్‌షోలో సత్యవతి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నీతులు వల్లిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక 420 అని, నీతులు చెప్పడం ఆయనకే చెల్లుతుందని విమర్శించారు. గిరిజన సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందులో భాగంగానే తండాలను, గూడేలను ప్రత్యేక జీపీలుగా మార్చి 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

