ములుగు, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. మంగళవారం ములుగులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచార యావ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.