హైదరాబాద్ : రేపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ నెల 16 నుంచి దళిత బంధు పథకం ప్రారంభం, రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ అమలు కానున్నందున లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు చెప్పారు.