నల్లగొండ : జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొండ మల్లేపల్లి, దేవరకొండ, దామరచర్ల, అడవి దేవులపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొండ మల్లేపల్లి మండలం లో
కేశ్యా తండా గ్రామంలో కేశ్యా తండా నాంపల్లి పీడబ్ల్యూ రోడ్డు వయా కొత్త బావి, హంక్య తండా వరకు రూ.3 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న బి.టి.రోడ్డు పనులకు శంకు స్థాపన చేశారు.
తర్వాత పన్ని తండా (గుర్రపు తండా) గ్రామంలో సాగరి పీడబ్ల్యూ రోడ్డు నుంచి పన్ని తండా వరకు రూ.కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బి.టి.రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అర్.వి.కర్ణన్, ఎస్.పి.అపూర్వ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ట్రై కార్ చైర్మన్ రాం చంద్ర నాయక్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,అర్.డి. ఓ శ్రీ రాములు, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి రాజ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.