Inter First Year | ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ 51శాతం మంది విద్యార్థులందరిని కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అందరి పాస్ చేయడం ఇదే చివరిసారి.. ఇకపై మరోసారి అందరు పాస్ చేయబోమని స్పష్టం చేశారు. పాసైన విద్యార్థులు ఇప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చన్నారు. శుక్రవారం ఆమె మీడియాలో సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయన్నారు.
అన్నిరంగాలతో పాటు విద్యావ్యవస్థ ఇబ్బందిపడిందన్నారు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అన్ని చర్యలు తీసుకుందన్నారు. మూడో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు ఖాళీగా ఉండకుండా.. డిజిటల్, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహించే ప్రయత్నం చేశామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో దుర్శదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహించామన్నారు. డిజిటల్ తరగతులను సైతం ఆశామాషీగా, నామ్‌కేవాస్త్‌గా నిర్వహించలేదని స్పష్టం చేశారు.
యాదగిరి చానల్ ద్వారా తరగతులు ప్రారంభించిన సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి, మారుమూల ప్రాంతాల్లో దూరదర్శన్ అందుబాటులో ఉందా? లేదా? అని వేరిఫై చేశామన్నారు. 93-95శాతం ఇండ్లలో దూరదర్శన్ ఉందని, 40శాతం మందికి ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నాయని సమాచారం వచ్చిందని, ఆ తర్వాత క్లాసులు తరగతులు ప్రారంభించామన్నారు. దూరదర్శన్ లేని పిల్లలకు గ్రామ పంచాయతీలు, పక్కనే ఉన్న స్టూడెంట్‌కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేశామని, పది, ఇంటర్ తరగతులకు వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఉపాధ్యాయులతో ఎవరి స్టూడెంట్ను వారు ఫాలో అప్ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు.
తొమ్మిది తరగతి పిల్లలను కరోనా నేపథ్యంలో పదో తరగతికి అప్‌గ్రేడ్ చేశామని, 10వ తరగతి విద్యార్థులను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్‌కు పంపామన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయాల్సిన పిల్లలను పాస్ చేశామన్నారు. బ్యాగ్‌లాగ్స్ ఉన్నా ప్రమోట్ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అన్నారు. దేశంలో ఉన్నతమైన విద్య అందాలనే రాష్ట్రంలో సీఎం ఆదేశాలతో వారికి ఉచితంగా, బుక్స్ అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.
దాదాపు 900పైచీలుకు గురుకులు ఏర్పాటు చేశామని, గురుకులాల్లో ఎలాంటి విద్య అందుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రతి విద్యార్థి గురుకులంలో చదువుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి గురుకులాల్లో సీటు కావాలని అడుగుతున్నారన్నారు. 620 గురుకులాల్లో అప్‌గ్రేడ్ చేసి ఇంటర్ వరకు విద్య అందిస్తున్నామని, 172 కస్తూర్బా విద్యాలయాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశామని, కస్తూర్బా, గురుకులాలు, మోడల్ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి పిల్లలు చదువుతున్నారని, వారికి మంచి విద్య అందించాలనే ఇంటర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.
డిజిటల్ తరగతులు అందిస్తున్న సమయంలో దూరదర్శన్, టీశాట్‌లో విద్యార్థులు తరగతులు హాజరుకాకపోతే వారు చూసుకునేందుకు అనుగుణంగా వెబ్సైట్లలో పాఠాలు అందుబాటులో ఉంచామని, ఏ సబ్జెక్ట్ అయితే చెప్పామో.. ఆయా సబ్జెక్ట్‌లను దూరదర్శన్, టీ శాట్ వెబ్సైట్, ఇంటర్మీడియట్ బోర్డ్ యూ ట్యూబ్ చానల్లో అందుబాటులో ఉంచామన్నారు. ఇంటర్ యూట్యూబ్‌లో 3.10లక్షల మంది పిల్లలు సబ్‌స్క్రైబ్ చేసుకొని పాఠాలు చూశారన్నారు. పరీక్షలు వస్తున్న తరుణంలో పిల్లలకు ఆందోళనకు గురవుతారని, వారికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు మానసిక నిపుణులు బోర్డులో నియమించినట్లు చెప్పారు.
ప్రత్యేక లెక్చర్లకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు ఇబ్బందులు పడకుండా సలహాలు సూచనలు ఇచ్చేందుకు 2500 మందిని నియమించామన్నారు. పిల్లల కెరియర్ ముఖ్యమనే ఉద్దేశంతోనే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన పిల్లలను పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ రాయకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేశామన్నారు. సెకండియర్ ఫైనల్ ఎగ్జామ్స్‌కు వెళ్లే ముందు ఒక పరీక్ష నిర్వహిస్తే పిల్లలు సైతం అప్రమత్తమవుతారనే ఉద్దేశంతోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 75శాతంమే సిలబిస్ ఇవ్వడంతో పాటు దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు.
పరీక్షలు రాసే సమయంలో మరిన్ని అవకాశాలు ఇచ్చామని, లర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇచ్చామని.. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాస్తున్న పిల్లలకు మెటీరియల్ ఇచ్చిన తర్వాత నెలకు పరీక్షలు నిర్వహించామన్నారు. 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2.24లక్షల మంది (49శాతం) పాసయ్యారని, 51శాతం ఫెయిల్ అయ్యారన్నారు. 2014 నుంచి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలించామని.. 2014లో 59శాతం, 2015లో 51శాతం, 2016లో 62శాతం, 2017లో 66శాతం, 2018లో 67శాతం, 2019లో 65శాతం, 2020లో 68శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.
ఈ సారి 49శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారన్నారు. 51శాతం మంది ఫెయిల్ సమయంలో విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇవ్వలేదని, డిజిటల్, ఆన్లైన్ తరగతులు చూడలేకపోయారనడం సరికాదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో సైతం విద్యార్థులు కష్టపడి చదివారన్న ఆమె.. ఇంకా వారిని పదును పెడితే మరింత మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటదన్నారు. 49శాతం పాస్ అయిన వారిలో.. ఇందులో 10వేల మంది విద్యార్థులకు 95శాతం మార్కులు వచ్చాయన్నారు.
ఈ క్రమంలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం పొరపాట్లు చేసినట్లు మాట్లాడడం బాధాకరం పిల్లల కెరియర్ ముఖ్యమని, వారు భవిష్యత్‌లో కాబట్టి పోటీ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై నిందలు వేయడం బాధాకరమని, ఇందులో బోర్డు, ప్రభుత్వం తప్పేమీ లేదని స్పష్టం చేశారు.