Minister Sabitha Indrareddy | రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha Indrareddy | కేసీఆర్ పాలనను చూసి ప్రజలు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు .
కందుకూరు : కేసీఆర్ పాలన ( CM KCR Rule)ను చూసి ప్రజలు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy) అన్నారు . మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడప దాటవని ఆరోపించారు.
అభివృద్ధి,సంక్షేమంలో రాష్ట్రం దేశానికి ఆదర్శమని అన్నారు. పేద ప్రజలను మరింత పేదలుగా మారుస్తు, ధనికులను, కార్పొరేట్ సంస్థలను మరింతగా బలోపేతం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నారని వివరించారు.
రైతు బంధు, రైతు బీమా, బీసీ బంధు, గృహలక్ష్మి (Grihalaxmi) వంటి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి.మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులిమామిడి బీజేపీ ఎంపీటీసీ రాజమ్మతో పాటు ఆమె అనుచరులు, దావుద్గూడ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రిష్ణారెడ్డి, అనుచరులు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, వార్డు మెంబర్లు హనమంతు,హరినాయక్, వెంకటేషం. సురేష్ నాయక్, ప్రకాష్ నాయక్ వారీ పార్టీలకు రాజీనామలు చేసి బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

