హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని విజన్‌తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మ హేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మం డలం సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల ప్లీనరీలో మంత్రి సబిత ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం కోసం పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్కామ్‌ల కోసం పని చేస్తున్నదని ఆరోపించారు.