ఎస్ఏవీఎస్తో నకిలీ సర్టిఫికెట్ల ఆటకట్టు
నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్‌ఏవీఎస్) వెబ్సైట్ దోహదపడుతుందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
- వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- పీజీ, డిగ్రీ ధ్రువపత్రాల వెరిఫికేషన్
- త్వరలో ఇంటర్, టెన్త్‌కు విస్తరణ
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్‌ఏవీఎస్) వెబ్సైట్ దోహదపడుతుందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఎస్‌ఏవీఎస్ వెబ్‌సైట్‌ను శుక్రవారం ఆమె డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి మాసబ్‌ట్యాంక్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్టిఫికెట్లను సులభంగా, అత్యంత వేగంగా ఒకే ఒక్క క్లిక్‌తో ఈ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్ చేయవచ్చునని తెలిపారు. ఈ పోర్టల్ విద్యాశాఖలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, త్వరలోనే ఇంటర్, పదో తరగతి సర్టిఫికెట్లను సైతం వెరిఫికేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు.
ఇలాంటి పోర్టల్ దేశంలోనే మొదటిదని, 2010 నుంచి 2021 మధ్యకాలంలో పట్టభద్రులైన 25 లక్షల విద్యార్థుల డాటాను, సర్టిఫికెట్లను ఇందులో పొందుపరిచామని వివరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న వారిపై క్రిమినల్ కేసులతోపాటు పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరు ణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, పలు వర్సిటీల వైస్చాన్స్లర్లు రవీందర్, గోపాల్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రాథోడ్, తాటికొండ రమేశ్, రవీందర్ గుప్తా, ఎస్ మల్లేశ్, కన్సల్టెంట్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఇది వరకు ఇలా..
ఎవరైనా విద్యార్థి దాఖలు చేసిన సర్టిఫికెట్‌పై అనుమానం వచ్చినా, ఫిర్యాదు వచ్చినా.. సంబంధిత ఏజెన్సీలు తొలుత వర్సిటీలకు లేఖలు రాసేవి. ఒక్కోసారి స్వయంగా వెళ్లి దరఖాస్తు చేయాల్సి వచ్చేది. వర్సిటీల పరీక్షల విభాగాలు పని ఒత్తిడి కారణంగా ఆలస్యంగా స్పందించేవి. ఒక్కొక్కసారి యూనివర్సిటీల నుంచి జవాబు పొందడానికి ఏండ్లు పట్టేది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది.
ఇప్పుడిలా..
ఈ వెబ్‌సైట్‌తో నకిలీ సర్టిఫికెట్లను సులభంగా గుర్తించవచ్చు. ఒకే ఒక్క క్లిక్‌తో కేవలం నిమిషాల్లోనే అసలుదో, నకిలీదో నిర్ధారించుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. వెబ్సైట్లో రాష్ట్రంలోని 15 వర్సిటీల పరీక్షల విభాగాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని పొందుపరిచారు. ఇది అత్యంత నమ్మకమైనది.
సేవలిలా..
- ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు, విద్యాసంస్థలు అకడమిక్ సర్టిఫికెట్లను పరిశీలించాలనుకుంటే www.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. స్టూడెంట్ వెరిఫికేషన్‌పై క్లిక్ చేయాలి. తమ ఈ-మెయిల్ అడ్రస్‌ను నమోదుచేయాలి. వన్‌టైం పాస్వర్డ్, పేరు, తదితర వివరాలను ఎంటర్ చేయడం ద్వారా సర్టిఫికెట్‌ను వెరిఫై చేయించవచ్చు. భవిష్యత్తులో ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం తప్పనిసరిచేయనున్నారు.
- ఇన్స్టంట్ వెరిఫికేషన్ సర్వీస్‌లో భాగంగా విద్యార్థి హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఆ విద్యార్థి పేరు, పాసైన సంవత్సరం, విద్యార్థి ఫొటో ప్రత్యక్షమవతాయి. ఈ సేవలు పూర్తి ఉచితంగా లభిస్తాయి.
- డిటెయిల్డ్ వెరిఫికేషన్ సర్వీస్‌లో పై వివరాలతోపాటు ఆ విద్యార్థి పాసైన కోర్సు, పొందిన గ్రేడ్ వివరాలు కూడా లభ్యమవుతాయి. దరఖాస్తుదారులు కోరుకుంటే డిజిటల్ సంతకం చేసిన మెమో సాఫ్ట్‌కాపీ సైతం రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు వస్తుంది. ఇందుకు రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

