షాద్‌నగర్, ఆగస్టు 19: విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ నాయకులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎంతబలోపేతమైందో మొత్తం దేశానికి తెలిసినా స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలియకపోవడంతో విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల విద్యా విధానం అమలుపై ఇతర దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు కొనియాడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం జిర్ణీంచుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. గత పాలనలో ఇంజినీరింగ్ కళాశాలలు కోళ్ల ఫారాల్లో ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదనా? అని ప్రశ్నించారు.