హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షలను అపహస్యం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని, రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం.. పరీక్షలను రద్దుచేయించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో చక్కర్లుకొట్టడం తదనంతర పరిణామాల నేపథ్యంలో మంత్రి బుధవారం టీ న్యూస్ చర్చ లో మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలను తాము తొమ్మిదేండ్లుగా ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాజకీయంగా ఏదో కుట్ర జరుగుతుందని ముందే ఊహించామని, ప్రతిపక్షాల ఆలోచన వేరుగా ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఈ సందర్భగా మంత్రి ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ముక్కుపచ్చలారని పదో తరగతి విద్యార్థులను పావుగా వాడుకున్నారు.. విద్యార్థులు పరీక్షాకేంద్రాల్లోకి వెళ్లాక పేపర్‌ను బయటికి తీసుకొచ్చారు. గందరగోళ వాతావరణాన్ని సృష్టించి, తల్లిదండ్రులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్న భారీ కుట్ర దీని వెనుక దాగి ఉంది.
తాండూరులో బీజేపీ అనుబంధ సం ఘం టీచర్ ద్వారా పేపర్ బయటికి వచ్చింది. తన అనుచరుడు ప్రశాంత్‌తో చాటింగ్ చేసిన విషయాలే బండి సంజయ్ ప్రెస్మీట్లో మా ట్లాడారు. రాజకీయ లబ్ధికోసం. పరీక్షలు రద్దుచేయించాలన్న కుట్రకోణం దీని వెనుక దాగిఉంది. పదో తరగతి ప్రశ్నపత్రాలు విద్యార్థుల వద్దనే ఉన్నప్పుడు బయట వాట్సాప్‌లో వస్తే లాభమేంటి? ప్రశ్నలు బయటికొచ్చాక ఆన్సర్లు లోపలికి వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితులో ఉం డదు. మరి ఇదిరాజకీయం కోసం కాక మరేమవుతుంది?’ అని మంత్రి ప్రశ్నించారు.
సెల్‌ఫోన్‌తో అనుమతించొద్దని చెప్పాం..
‘పరీక్షల సమయంలో సిబ్బంది, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు వినియోగించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. మంత్రిగా నేను తనిఖీలకు వెళ్లినా ఫోన్ బయటపెట్టాకే అనుమతించాలని చెప్పాం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే తాండూరులో ఇద్దరు టీచర్లను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం.’ అని తెలిపారు.
పరీక్షలను అపహాస్యం చేయాలనే..
‘బండి సంజయే కుట్రదారు.. పాత్రధారు డు. ఆయన కుట్రదారు కాకపోతే తన సెల్‌ఫోన్‌ను పోలీసు విచారణకు ఇవ్వకపోవడం ఏమి టి? పేపర్‌ను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను, ఆం దోళనకు గురి చేయటం సరైన పద్ధతేనా? పిల్లల జీవితాలతో ఆడుకొనే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. గతంలో ప్రతిపక్షాలు ఎన్నడూ వి ద్యావ్యవస్థను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేదు. కానీ ఇప్పుడు బీజేపీ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నది. మోదీ, అమిత్‌షా ఆదేశాలతోనే బండి సంజయ్ ఇలాం టి చర్యలకు పాల్పడ్డారు.’ అని విమర్శించారు.
బండి కుట్రలకు ఇద్దరు బలయ్యారు
‘టీచర్లు అనవసరంగా రాజకీయ పావులు కావొద్దు. బండి కుట్రలకు ఇద్దరు బలయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలపై అనుమానాలు, టెన్షన్ అక్కర్లేదు’ అని మంత్రి చెప్పారు.
బండి సంజయ్ లాంటి వాళ్లు దేశానికి ప్రమాదకరం
బండి సంజయ్‌ని తీవ్రమైన నేరగాడిగా పరిగణించి, ఆయనపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయా లి. ఇంటి పేరు జపిస్తేనే ఓ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేశారు. అలాగే బండి సంజయ్‌ని ఎంపీగా తొలగించాలి. ఇలాంటి వాళ్లు దేశానికి అత్యంత ప్రమాదకరం. పిల్లలకు పదో తరగతి మొదటి మెట్టు. ఇలాంటి కీలక తరుణంలో పేపర్లు బయటికి రావడంతో మానసిక ైస్థెర్యాన్ని కోల్పోతారు.
– రవీందర్‌రెడ్డి, ఓ విద్యార్థి తండ్రి, మంచిర్యాల
పరీక్షలకు సహకరిస్తాం
ప్రశ్నపత్రాలు ఇలా వాట్సాప్‌లో చక్క ర్లు కొట్టడం అత్యంత బాధాకరం. నా కూతురు సైతం ఎగ్జామ్స్ రాస్తున్నది. సెం టర్ నుంచి హాస్టల్‌కు తీసుకెళ్తున్నప్పుడు పేపర్ బయటికొచ్చినట్టు తెలియడంతో.. మళ్లీ ఎగ్జామ్ పెడతరా! రద్దు చేస్తరా ! అని నా కూతురే నన్ను అడిగింది. ఫొటో తీయడం, వాట్సాప్‌లో తిప్పడం దారు ణం. కావాలని పరీక్షలకు అంతరాయం కలిగించాలని చేసిన ప్రయత్నమిది. పీఆర్టీయూ టీఎస్ సంఘంగా పరీక్షల నిర్వహణకు మేం పూర్తిగా సహకరిస్తాం.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు