TS Assembly | ప్రభుత్వ పాఠశాలలకు రూ. 80 కోట్ల నిధులు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
TS Assembly | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు.. 2017-18లో రూ.38 కోట్లు, 2018-19లో రూ.49 కోట్లు, 2019-20లో రూ.46 కోట్లు, 2020-21లో రూ.80 కోట్లు, 2021-22 ఏడాదికి రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులుండి, ఎక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాలలను గుర్తించే రేషనలైజేషన్ చేస్తున్నామని తెలిపారు. ఆ పోస్టులను సర్దుబాటు చేసిన తర్వాత విద్యావాలంటీర్ల నియామకం గురించి ఆలోచిస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మైదానం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రకృతి వనాల ఏర్పాటుకు కలెక్టర్లకు తామే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆ పార్కుల వల్ల పిల్లలకు కూడా మంచి వాతావరణం ఇచ్చిన వాళ్లం అవుతామన్నారు. గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలల నిర్వహణను లోకల్ బాడీస్, కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పాఠశాలలను అర్బన్ లోకల్ బాడీస్ చూసుకోవాలని చెప్పారు. ఇక చాలా గ్రామాల్లో సర్పంచ్‌లే బాధ్యత తీసుకుని పాఠశాల నిర్వహణను చూస్తున్నారు. ఎక్కడైనా సర్పంచ్‌లు పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోకపోతే ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసి తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

