మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. సోమవారం మహబూబ్నగర్ లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసానికి చేరుకున్న మంత్రి సబిత శాంతమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలేరు యాదయ్య తదితరులు ఉన్నారు. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, విప్ గువ్వల బల్ రాజ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి..
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
Yadadri Temple | యాదాద్రిలో లక్ష పుష్పార్చన