ఖమ్మం, నమస్తేతెలంగాణ ప్రతినిధి ;‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం నగరం 29వ వార్డు ప్రకాశ్‌నగర్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి మురుగు కాలువలను పరిశీలించారు. డెంగీ ప్రబలకుండా ఉండేందుకు.. మంత్రి స్వయం గా చేతులకు గ్లౌజులు తొడుక్కొని మురుగు కాలువలో ఆయిల్ బాల్స్ వదిలారు. పారిశుధ్య నిర్వహణ, డెంగీ నివారణ చర్యల్లో పువ్వాడ చొరవను ఖమ్మం నగర వాసులు ప్రశంసిస్తున్నారు.