ఖమ్మం : నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెలగాటమాడుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvvada) మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని 25వ డివిజన్ మేదర బజార్‌లోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు(Kanti velugu) వైద్యశిబిరాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ఒక్క స్కాం లేకుండా, అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేస్తుందన్నారు. ఇది ఓర్వలేని బీజేపీ నాయకులు(Bjp leaders) కేసీఆర్(KCT), కేటీఆర్(KTR)లను అప్రతిష్టపాలు చేసేందుకు టీఎస్పీఎస్సీ, పదోతరగతి పేపర్లను సాక్షాత్తు లీక్(Papers leakage) చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఏ1గా ఉండి జైలుకు వెళ్లారని ఆరోపించారు.
తప్పుడు విధానాలతో రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో మంజూరైన 178 మంది లబ్ధిదారులకు రూ.1.78కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.