హైదరాబాద్ : తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారకుడైన బండి సంజయ్‌కు ఆ పదవిలో ఉండే నైతిక హక్కులేదని, తక్షణమే లోక్‌సభ స్పీకర్(Lok Sabha) ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvvada) డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్దిపొందాలనుకుంటే ప్రజల మనసులు గెలవాలే కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని ఆరోపించారు.
బాధ్యతాయుతమైన వ్యక్తులు చేసే పనేనా అని ప్రశ్నించారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది విద్యార్థులు, వారి . పేపర్ లీకేజీ(Paper Leakage) వ్యవహారం అంతా బీజేపీ కేంద్ర పార్టీ కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) దగ్గరి నుంచి మొదలుపెడితే హోంమంత్రి అమిత్‌షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(Nadda), కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Minister Kisan Reddy) సహ అందరూ సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తే భర్తీ ప్రక్రీయను ఆపేందుకు లీకులకు తెరలేపారని ఆరోపించారు. ఆఖరికి పదో తరగతి పరీక్షా పేపర్లు లీకేజీకి కుట్ర పన్నిన బండి సంజయ్‌ను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాన్ని ప్రజలు, విజ్ఞులు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు. బీజేపీ పన్నిన కుట్రలకు అమాయకులు బలికాకూడదని ఆయన సూచించారు.
బండి సంజయ్, రేవంత్‌రెడ్డి ఈ ఇద్దరు నేతలు జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పటి నుంచి రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వార్థరాజకీయాల కోసం సంఘ విద్రోహులు సృష్టించే దుశ్చర్యలను తలపించే విధంగా బండి సంజయ్ చర్యలున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.