హైదరాబాద్ : పౌరసేవల్లో రవాణాశాఖ ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు రావడంపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎనీవేర్, ఎనీ టైం ఆన్లైన్ సేవలకు అవార్డును దక్కించుకోవడం ముదవాహం అన్నారు. రవాణాశాఖ అందజేసే పౌర సేవలను మరింత సులభతరం చేసే విధంగా ఆన్లైన్ సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల వెసులుబాటు కోసం ఈ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. తద్వారా సేవల్ని మరింత తేలిగ్గా పొందుతున్నారన్నారు. జాతీయ స్థాయిలో పురస్కారం దక్కడంపై రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.