ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ముక్కు నేలకు రాసి క్షమాపణ చేప్తానని, ఆస్తులను ప్రజలకు పంచుతానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు.
- నా ఆస్తులు ప్రజలకు రాసిస్తా
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ
- ఎన్నికలపుడే వచ్చే వారిని నమ్మొద్దు: నామా
ఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ముక్కు నేలకు రాసి క్షమాపణ చేప్తానని, ఆస్తులను ప్రజలకు పంచుతానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం ప్రజాఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక, దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ నేతలైన పొంగులేటి, తుమ్మలేనేనని స్పష్టం చేశారు. చిన్నయసూరి నీతి కథలో కరటక, దమనకులనే రెండు నక్కలకు సంబంధించిందని, ఆ నకల అసలు రూపం వారిద్దరేనని అభివర్ణించారు. వారి నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకు వచ్చే వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

