ఆడబిడ్డల సంతోషమే లక్ష్యం
‘తెలంగాణలోని ఏ ఒక్క ఆడ బిడ్డ కూడా కన్నీరు పెట్టకూడదు. ఆమె కంట వెలుగులు నిండాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- 64 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఖమ్మం, అక్టోబర్ 17: ‘తెలంగాణలోని ఏ ఒక్క ఆడ బిడ్డ కూడా కన్నీరు పెట్టకూడదు. ఆమె కంట వెలుగులు నిండాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని 64 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
టీఆర్ఎస్(బీఆర్ఎస్) నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘పేదింటి ఆడబిడ్డల పెండ్లి కష్టాలు తీర్చేందుకు, వారి కన్నీళ్లు తుడిచేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అండగా నిలిచారు’ అని చెప్పారు.
తెలంగాణలోని సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలంటూ దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 7,515 మందికి రూ.70.21 కోట్ల విలువైన చెక్కులు అందించడం గర్వంగా ఉందని తెలిపారు. లబ్ధిదారులతో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సహఫంక్తి భోజనం చేశారు.
అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధునాతన పరికరాలను ఆయా వృత్తిదారులకు పంపిణీ చేశారు. ఖమ్మంలోని 56వ డివిజన్ ద్వారకానగర్‌లో రూ.45 లక్షలు, 51వ డివిజన్ ఎన్ఎస్పీ క్యాంప్‌లో రూ.45 లక్షలు, 39వ డివిజన్ మేదరబజార్‌లో రూ.45 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

