వేములవాడ : రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు వచ్చేది వేములవాడకే. వేద పండితులు, శృంగేరి పీఠా ధిపతులతో చర్చించి త్వరలోనే ఆలయ అభివృద్ధికి పునాదులు వేస్తామని రోడ్డు రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని(Vemulawada Rajanna )దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తాను రాజన్న భక్తుడినని తెలిపారు. రాబోయే కార్తీక మాసంలో నిత్యా న్నదానం చేయాలనే ఆలోచన ఉంది. తిరుమలలో లాగా శాశ్వత అన్నదానం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడలో కోడెల రక్షణపై సీఎం ఆదే శాలతో గోశాల ఆధునీకరణ చేస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థంవసతి గదుల నిర్మాణం చేస్తాం. తెలం గాణ రాష్ట్రం మంచి వర్షాలతో బాగుండాలని రాజన్నను వేడుకున్నట్లు ఆయన తెలిపారు.