హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదా రి భద్రత మాసోత్సవాల్లో భాగం గా ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
రహదారి భద్రత మాసోత్సవాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం సచివాలయం నుం చి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజు సుమారు 20 మంది మరణిస్తున్నారని, దీనిని పూర్తిగా తగ్గించడానికి కలిసి పనిచేయాలని సూచించారు.