హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ) : గురుకులాలను ఆర్సీవోలు విధిగా తనిఖీ చేయాలని, హాస్టళ్లలో ఏది జరిగినా అధికారులదే బాధ్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ గురుకులాల ప్రిన్సిపాల్స్, ఆర్సీవోలు, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ శ్రీధర్తో పాటు ఇతర అధికారులతో మంత్రి పొన్నం జూమ్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఇటీవల గురుకులాల్లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడద్దని ఆదేశించారు. ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.