హుస్నాబాద్, సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పారు. లింగమూర్తి, వల్లపు రాజు, సరోజన, చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు.