హైదరాబాద్, జూన్ 11 (నమ స్తే తెలంగాణ): జిల్లాల్లో వాహనాల తనిఖీ టార్గెట్లను పూర్తి చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం లో మంగళవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి మాట్లాడారు. రవాణాశాఖ కార్యాలయాలకు సొంత భవనాలకు భూములను గుర్తించాలని సూచించారు. రవా ణా శాఖ వాహనాలను ఒకే గూటికి తీసుకొచ్చేలా స్టికరింగ్ ఉండేలా చూసుకోవాలని కోరారు.విద్యాసంస్థల వాహనాలు ఫిట్నెస్ ఉంటేనే రోడ్డెకే లా చూడాలని ఆదేశించారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ప్రవీణ్, రమేశ్, మమత తదితరులు పాల్గొన్నారు.