కరీంనగర్ : గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలంలోని పలు గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ అని, గత5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పడ్డ కష్టానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సర్పంచ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాన్ని పట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా పని చేశారన్నారు. వచ్చే వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటమని మంత్రి తెలిపారు.
ఏ ఇబ్బందులు ఉన్నా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి పవన్ కుమార్, ఎంపీపీ కె.వినీత, జెడ్పీటీసీ గీకురు రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు..