హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): గురుకుల అద్దె భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమైతే తోడ్కల్ తీస్తమని హెచ్చరించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం శాసనసభలో గురుకులాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అద్దె చెల్లించకపోవడంతో యజమానులు గురుకులాలకు తాళాలు వేసేందుకు సిద్ధమయ్యారని, వారిని భయపెట్టో, నచ్చజెప్పో తాళాలు వేయకుండా చేసినట్టు తెలిపారు.
గురుకుల అద్దె భవనాలకు బకాయిలు లేకుండా చూస్తామని చెప్పారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఏయ్.. మైక్ తీస్కొని మాట్లాడు’ అంటూ ఆయన్ను హెచ్చరించే ధోరణితో మాట్లాడటం గమనార్హం. మంత్రి పొన్నం తీరుపై గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.