హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే ప్రస్తు తం మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అయినా కాళేశ్వరం జలాలు అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అంబేదర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులోనే రూపకల్పనలోనే ఎల్లంపల్లి , నందిమేడారం, లక్ష్మీబరాజ్, మిడ్‌మానేర్, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగ ర్ భాగమై ఉన్నాయని చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొన్నం మాట్లాడారు.
కాంగ్రె స్ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు. కేసీఆర్ చేసిన రీడిజైన్ నిరుపయోగమని, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్‌కు వచ్చే నీరు ఎల్లంపల్లి నుంచి తీసుకున్నవి మాత్రమేనని, విడతల వారీగా వర్షాలు కురవడం వల్లే అది సాధ్యమైందని తెలిపారు. ఆగిన పనులు పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్టు రూపొందించినట్టవుతుం దా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి ఒక చుక ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోయకుండా ప్రాజెక్ట్‌లను నింపితే అవి కాళేశ్వరం నీళ్లు ఎట్లా అవుతాయో హరీశ్‌రావు సమాధానం చెప్పాలన్నారు.