హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎవర్నీ ఏమనలే’ అని చెప్పారు. ఈ వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అన్ని వివరాలు తెలియజేశానని తెలిపారు. ఇక పార్టీ చూసుకుంటుందని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రపై ఎవరూ స్పందించకుంటే మంచిదంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఏం తెలుసు.. ఆ దున్నపోతుగాడికి’ అంటూ వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా దీనిపై మంత్రి అడ్లూరి స్పందించి స్వయంగా వీడియో విడుదల చేశారు.