వేములవాడటౌన్, జనవరి 13 : వేములవాడ రాజన్న నిత్యాన్నదాన సత్రానికి రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.45 లక్షల విరాళాన్ని ఈవో వినోద్‌రెడ్డికి అందజేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోమవారం వేములవాడ రాజన్నను దర్శించుకుని పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు.
ఖలీల్‌వాడి జనవరి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పా టు చేయనున్ను జాతీయ పసుపుబోర్డును మంగళవారం ప్రారంభించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పసుపుబోర్డు చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు.