హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రామ స్థాయిలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటైన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఎంపికచేసిన వారిని మళ్లీ 10,954 రెవెన్యూ గ్రామా ల్లో నియమిస్తామని చెప్పారు. మరో వెయ్యి మందిని సర్వే సెటిల్మెంట్ విభాగంలోకి తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూత న ఆర్వోఆర్ చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. 18 రాష్ర్టాల్లో అధ్యయనం చేసి అకడ అమలవుతున్న మంచి అం శాలను నూతన చట్టంలో పొందుపరిచామని తెలిపారు. ఏడాది కాలంలో ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన అనేక చర్యలు చేపట్టామని, మాడ్యూళ్లను మార్చామని, తాసిల్దార్లకు, ఆర్డీవోలకు, అదనపు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చామని తెలిపారు. నిర్వహణ బాధ్యతను టెర్రాసిస్ సం స్థ నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీకి అప్పగించామని చెప్పారు. కొత్త చట్టం తర్వాత ధరణి పోర్టల్‌లో 11-14 మాడ్యూళ్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి విడత స్థలం ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేస్తామని, రెండో దశలో ప్రభుత్వమే స్థలంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్ పాల్గొన్నారు.