హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో పెట్రోల్, డీజిల్ కొరతపై మంత్రులు తలోమాట మా ట్లాడుతున్నారు. ఒకరు కొరత ఉన్నదంటే.. మరో మంత్రి లేదంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ఒక విధానం లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ బుధవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉన్నదని చెప్పారు. గతంతో పోల్చి తే డీజిల్ సరఫరాను 210%, పెట్రోల్ సరఫరాను 132% పెంచినట్టు తెలిపారు. మరో మంత్రి పొంగులేటి స్పందిస్తూ పె ట్రోల్, డీజిల్ కొరత ఉన్నదని చెప్పారు. ఈ కొరతకు కేంద్రమే కారణమని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కేంద్రం గతంలో ఎరువుల సరఫరాలో వివక్ష చూ పిందని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సరఫరాలోనూ వివక్ష చూపుతున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతను రాష్ట్ర ప్రభుత్వంపై నె ట్టాలని చూస్తే ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చా రు. మరో మంత్రి తు మ్మల సైతం పెట్రో ల్, డీజిల్ కొరత ఉ న్నదని స్పష్టంచేశారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధ రలు పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చే స్తున్నదని, అందుకే సరఫరాలో ఆటంకం సృష్టిస్తున్నదని ఆరోపించారు. ఇలా మంత్రులు తలోమాట మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.