హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్లపై రాష్ట్ర గృహనిర్మాణం, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విస్మయం కలిగించే సమాధా నం ఇచ్చారు. హెచ్‌సీయూ నుంచి స్వాధీనం చేసుకున్న 400 ఎకరాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కట్టి ఇస్తుందా అని విలేకరు లు ప్రశ్నించగా.. ‘ఎక్కడివి ఇందిరమ్మ ఇండ్లు.. కట్టినప్పుడు చూద్దాం’ అని చెప్పి విలేకరుల సమావేశం నుంచి నిష్క్రమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.