హైదరాఆద్ : రాబోయే కొద్ది రోజుల్లో ఆర్వోఆర్ 2024 చట్టం(ROR 2024 Act) తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) అన్నారు. రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, 970 తహసీల్దార్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా ఈ చట్టం దేశంలోనే ఆదర్శంగా ఉండబోతుందన్నారు. అధికారుల నుంచి సూచనలు, సలాహాలు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,900 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
ప్రతి రెవెన్యూ విలేజ్కు రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశమై ఇంకా అనేక అంశాలు చర్చిస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 2024 ROR తీసుకురాబోతున్నాం. భూములు ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి పాలన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.