INDW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ (Pakistan)ను ఢీ కొడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సనా ఫాతిమా బ్యాటింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఉత్కంఠ పోరులో విజయంతో బోణీ కొట్టిన పాక్ జోరు మీద ఉంది.
సెమీస్ రేసులో నిలవాలంటే హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ఈ మ్యాచ్ చాలా కీలంక. పైగా మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై మంచి రికార్డు (4-2) ఉన్న అమ్మాయిల జట్టు భారీ తేడాతో గెలిస్తే అవకాశాలు మెరుగుపడతాయి. బౌలింగ్‌ను నమ్ముకున్న పాకిస్థాన్‌కు బ్యాటింగ్ యూనిట్లో బలంగా ఉన్న భారత చెక్ పెట్టనుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
🚨 Toss and Team Update 🚨
Pakistan win the toss in Dubai, #TeamIndia will bowl first.
One change in our Playing XI for today.
Follow the match ▶️ https://t.co/eqdkvWVK4h#T20WorldCup | #INDvNZ | #WomenInBlue pic.twitter.com/5MZn76NMRl
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
భారత జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, సంజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్.
పాకిస్థాన్ జట్టు : మునీబా (వికెట్ కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమిన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సొహైల్, ఫాతిమా సనా(కెప్టెన్), టుబ హసన్, నశ్రా సంధు, సైయద అనూబ్ షాహ్, సదియా ఇక్బాల్.